లాలూ ఎందుకు పోటీ చేయట్లేదో ఎవరైనా అడిగారా? అంటూ సమాధానం కూడా తనే చెప్పిన మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాలూ ఎందుకు పోటీ చేయట్లేదో ఎవరైనా అడిగారా? అంటూ సమాధానం కూడా తనే చెప్పిన మోదీ

ప్రస్తుత బీహార్ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఎందుకు పోటీ చేయట్లేదో ఎవరైనా అడిగారా? అని నరేంద్ర మోదీ ససారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రశ్నించారు. ప్రచారంలో భాగంగా నిన్నటి నుంచి రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్న ఆయన, లాలూపై తనదైన శైలిలో ప్రశ్నలు వేసి, ప్రజల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. లాలూ పలు కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్షను కూడా అనుభవించారని గుర్తు చేశారు. భారత న్యాయ వ్యవస్థ ఆయన్ను ఎన్నికల నుంచి బహిష్కరించిందని, ఆటువంటి వ్యక్తి పార్టీకి ఓట్లు వేయవద్దని ఆయన కోరారు. తక్కువ కాలంలో జితన్‌రామ్ మాంఝీ సమర్థ పాలన ఎలా ఉంటుందో బీహారీలకు చూపించారని అభిప్రాయపడ్డ మోదీ, ఆయన పేదలను ఆదుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని వివరించారు. ఈ ఎన్నికల్లో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా రాష్ట్రాన్ని నాశనం చేసిన గత ప్రభుత్వానికి శిక్ష విధించాలని పిలుపునిచ్చారు.

More Telugu News