: మరోసారి కదిలిన ఉస్మానియా దండు... 100 మంది అరెస్ట్


గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కేసీఆర్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఆరోపిస్తూ, ఉస్మానియా వర్శిటీ విద్యార్థులు తలపెట్టిన చలో అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. వర్శిటీ ఆర్ట్స్ కళాశాల నుంచి విద్యార్థుల సమూహం ర్యాలీగా బయలుదేరగా, ఎన్ సీసీ గేటు వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు గిరిజన ఐక్య కార్యాచరణ సమితి నేతలతో పాటు 100 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తక్షణమే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ర్యాలీ, పోలీసుల మోహరింపుతో విద్యానగర్, నల్లకుంట పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.

  • Loading...

More Telugu News