: పుల్వామా జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదుల హతం
ఇద్దరు ఉగ్రవాదులు హతమమయ్యారు. పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్ లో జైషే-ఇ-మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఆదిల్ పఠాన్, బుర్మిల్ హతమయ్యారు. ఈ సంఘటన జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. భారత భూభాగంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతాదళాలు, స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. భద్రతాదళాలు, పోలీసులు రావడాన్ని పసిగట్టిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతాదళాలు ఎదురుకాల్పులు జరపడంతో ఉగ్రవాదులు హతమయ్యారు.