: శంకుస్థాపన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. రాజధాని నిర్మాణం, శంకుస్థాపనపై సీఆర్డీయే అధికారులతో సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు కీలక సూచనలు చేశారు. నదీ అభిముఖంగా రెండు ఐకానిక్ టవర్లు నిర్మించాలని తెలిపారు. రాజధానిలో మూడు రీజియన్లలో 9 ధీమ్ పార్కులు నిర్మించాలని ఆయన చెప్పారు. శంకుస్థాపన ప్రాంతం చరిత్ర గర్వించదగ్గ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా నిలిచిపోవాలని ఆయన అధికారులకు సూచించారు. శంకుస్థాపన ప్రాంతం దగ్గర్లో 6 హెలిప్యాడ్ లు నిర్మించాలని సూచించారు. శంకుస్థాపనకు హాజరయ్యే వీఐపీల కోసం మరిన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని ఆయన చెప్పారు.