: స్వచ్ఛ భారత్ ప్రజా ఉద్యమంగా సాగాలి: వెంకయ్యనాయుడు

స్వచ్ఛభారత్ ప్రజా ఉద్యమంగా రూపొందాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, జాతి, కుల, మత, వర్గ, వర్ణ, భాష, ప్రాంతాలకతీతంగా స్వచ్ఛభారత్ ను ప్రజలంతా చేపట్టాలని అన్నారు. దీనిని ప్రజలంతా బాధ్యతగా స్వీకరించాలని ఆయన సూచించారు. ప్రధాని మోదీ భారత్ ను సుసంపన్నం చేసేందుకు కంకణం కట్టుకున్నారని, అందుకే దేశ విదేశాల పర్యటనల ద్వారా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని ఆయన తెలిపారు. అలా అభివృద్ధిని అందరికీ పంచుతున్నారని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ అంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే కాదని, మనసులను కూడా నిర్మలంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. అలా ఉంటే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయని ఆయన చెప్పారు.

More Telugu News