: ఎక్కడలేని ఉత్సాహం... మూడు నిమిషాల్లో 365 పాయింట్లు దుమికిన మార్కెట్ బుల్
అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అర శాతం మేరకు తగ్గిన వడ్డీ రేట్లు స్టాక్ మార్కెట్ వర్గాలకు ఎక్కడలేని ఉత్సాహాన్ని అందించాయి. కేవలం మూడు నిమిషాల వ్యవధిలో స్టాక్ మార్కెట్ బుల్ 365 పాయింట్లు దూకింది. ఆర్బీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఆలోచనలో ఉదయం నుంచి స్తబ్దుగా సాగిన ట్రేడింగ్, రఘురాం రాజన్ మీడియా సమావేశం మొదలు కాగానే ముందుకు ఉరికింది. ఉదయం 10:59 గంటల సమయంలో 25,325 పాయింట్ల వద్ద ఉన్న సెన్సెక్స్ సూచిక, మూడు నిమిషాల అనంతరం 11:02 గంటలకు 25,689 పాయింట్లకు దూసుకెళ్లింది. ఆపై కొంత లాభాల స్వీకరణ జరగడంతో క్రితం ముగింపుతో పోలిస్తే, 135 పాయింట్ల నష్టంతో 25,480 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.