: నెల తిరగకముందే 1.30 కోట్ల యూనిట్లు...సేల్స్ లో రికార్డులు బద్దలు కొడుతున్న ఐఫోన్ 6ఎస్


స్మార్ట్ ఫోన్ల విభాగంలో ‘యాపిల్’ ఉత్పత్తి ‘ఐఫోన్’కు ఉన్నంత డిమాండ్ మరే ఇతర మొబైల్ కు లేదనే చెప్పాలి. ఐఫోన్ పేరిట ఇప్పటిదాకా యాపిల్ విడుదల చేసిన అన్ని మోడళ్లకు విశ్వవ్యాప్తంగా ఊహించని ఆదరణ లభించింది. తాజాగా ఈ నెల 9న సరికొత్త ఫీచర్లతో ఆ సంస్థ ఐఫోన్ 6ఎస్, 6ఎస్ ప్లస్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంకా నెల కూడా గడవలేదు, అప్పుడే ఈ మోడళ్లు 1.30 కోట్ల యూనిట్ల దాకా అమ్ముడుబోయాయి. ఐఫోన్ సిరీస్ లో గత మోడల్ ఐఫోన్6 కోటి మేర యూనిట్లు విక్రయం కాగా, ఈ రికార్డును ఐఫోన్ 6ఎస్ ఇప్పటికే అధిగమించేసింది. ఇంకా భారత్ తదితర దేశాల్లో ఐఫోన్ తాజా మోడల్ ఇంకా రిలీజ్ కాలేదు. వచ్చే నెల 16న భారత్ లో ఐఫోన్ 6ఎస్ మోడళ్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి సేల్స్ ను కూడా కలుపుకుంటే, ఐఫోన్ 6ఎస్ చెరిపేయలేని రికార్డులను సొంత చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News