: నేతాజీకి చెందిన మరిన్ని ఫైళ్లు బహిర్గతం

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు చెందిన మరిన్ని ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బహిర్గతం చేసింది. 1937 నుంచి 1947 మధ్య కాలంలో బెంగాల్ కేబినెట్ సమావేశాల్లోని అంశాలు ఈ సందర్భంగా బహిర్గతమయ్యాయి. నేతాజీకి చెందిన 64 ఫైళ్లను ఇప్పటికే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు బయటపట్టిన ఫైళ్లలో మొత్తం 12,744 పేజీలు ఉన్నాయి. ఫైళ్లతో పాటు కొన్ని డీవీడీలను కూడా బయటపెట్టారు. వీటన్నింటినీ నేతాజీ కుటుంబసభ్యులకు అందజేశారు. అలాగే కోల్ కతాలోని పోలీసు మ్యూజియంలో కూడా ఉంచారు. బహిర్గతమైన ఫైళ్ల ప్రకారం 1948లో నేతాజీ చైనాలో జీవించే ఉన్నట్టు అర్థమవుతోంది. చైనాలోని మంచూరియా ప్రాంతంలో ఆయన ఉన్నట్టు తెలుస్తోంది. కానీ, 1945 ఆగస్టు 22న విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారని టోక్యో రేడియో ప్రకటించింది. అప్పట్నుంచి నేతాజీ మరణం ఓ మిస్టరీలా మిగిలిపోయింది.

More Telugu News