: రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడుగా మారిన సచిన్ టెండూల్కర్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆట నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత విభిన్న రంగాల్లో తన అభిరుచిని చాటుతున్నాడు. వ్యాపార పనుల్లో బిజీగా ఉన్న సచిన్ ను స్వచ్ఛభారత్ అంబాసిడర్ గా మోదీ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఇందు కోసం ఓ గీతాన్ని రూపొందిస్తున్నారు. అందులో భాగంగా సచిన్ బాలీవుడ్ పాటల రచయిత ప్రసూన్ జోషి రచించిన పాటలో గొంతు కలిపాడు. ఈ పాటలోని కొన్ని పంక్తులను సచిన్ రచించడం విశేషం. ఈ పాటను స్వరపరచినది శంకర్ మహదేవన్, ఎహసాన్, లాయ్ అయితే వారికి సహకారం అందిస్తూ, సచిన్ స్వరాలు జతపరచడానికి పలు సూచనలు చేశాడు. అలాగే ఈ పాటను గాయకులతో కలిసి సచిన్ పాడాడు. ఈ పాటను ముఖేష్ భట్ చిత్రీకరించారు. కాగా, ఈ పాటను గాంధీ జయంతి అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్టు కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ తెలిపింది. ఇలా సచిన్ రచయిత, సంగీత దర్శకుడు, గాయకుడు అవతారమెత్తాడు.