: ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారు: భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టి.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై అక్రమ కేసులు పెడుతూ అణగదొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. టి.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావుపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలున్న చోట ప్రొటోకాల్ పాటించడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలను గులాబీమయం చేస్తున్నారని ఆగ్రహించారు. హైదరాబాద్ లో ఈ రోజు భట్టి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో రేపు రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై అన్ని మార్గాలను అన్వేషిస్తామని, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా వెనుకాడమని తెలిపారు.

More Telugu News