: కృష్ణా జిల్లాలో నాటుసారా విక్రయ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ తనిఖీలు

కృష్ణా జిల్లాలో నాటుసారా విక్రయ కేంద్రాలపై ఆబ్కారీ శాఖ అధికారులు ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని నందిగామ, బంటుమిల్లి, గన్నవరం, నూజివీడు, విస్సన్నపేట, జగ్గయ్యపేట మండలాల్లో తనిఖీలు చేస్తున్నారు. 187 మంది సిబ్బందితో చేస్తున్న ఈ తనిఖీల్లో 23 మందిని అధికారులు అరెస్టు చేశారు. ఈ సమయంలో 3వేల లీటర్ల నాటుసారాను అధికారులు ధ్వంసం చేశారు. పోలీసులు, ఎన్ ఫోర్స్ మెంట్ సహకారంతో ఆబ్కారీ శాఖ అధికారులు ఈ తనిఖీలు చేస్తున్నారు.

More Telugu News