: కేసీఆర్ సర్కారుపై దండెత్తిన కోదండరాం...సర్కారు నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలని వ్యాఖ్య

తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మరోమారు కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నేటి ఉదయం నాంపల్లిలో కొత్తగా ఏర్పాటైన జేఏసీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే అన్నదాతలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్యపైనా ప్రభుత్వం చెబుతున్న గణాంకాలు సరికావని ఆయన విమర్శించారు. వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం మొద్దుగుట్ట అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పైనా అనుమానం వ్యక్తం చేశారు. మావోయిస్టులను పోలీసులు పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి హతమార్చినట్లుగా అనిపిస్తోందని కోదండరాం వ్యాఖ్యానించారు.

More Telugu News