: హిమాచల్ ప్రదేశ్ సీఎంపై సీబీఐ కేసు

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు, అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో సీఎంతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో హిమాచల్ ప్రదేశ్ లోని సింగ్ ప్రైవేట్ రెసిడెన్సీ, ఢిల్లీలోని ఆయనకు సంబంధించిన 11 ప్రాంతాల్లో సీబీఐ ఈ ఉదయం నుంచి సోదాలు జరుపుతోంది. 2009 నుంచి 2011 వరకు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తన ఆదాయం కంటే రూ.6.1 కోట్ల మేర ఎక్కువ ఆస్తులు సమకూర్చుకున్నారన్నది సీబీఐ ఆరోపణ.

More Telugu News