: విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో వనజాక్షి దాడి ఘటనపై విచారణ

కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షి దాడి ఘటనపై జేసీ శర్మ కమిటీ విచారణ ప్రారంభించింది. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఈ విచారణ జరుగుతుంది. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, తహసీల్దార్ వనజాక్షి విచారణకు హాజరయ్యారు. ముందుగా కమిటీ ఎదుట వనజాక్షి వాదనలు వినిపించారు. అంతేగాక ముసునూరు రెవెన్యూ అధికారులను కూడా కమిటీ విచారించనుంది. అయితే అంతకుముందు విచారణ ప్రారంభించిన కమిటీ నేడు రంగంపేటలోని తమ్మిలేరు వద్ద క్షేత్రస్థాయిలో కమిటీ పర్యటించి వివరాలను సేకరించాలనుకుంది. అయితే అక్కడ ఇసుక వివాదం మళ్లీ తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసులు కమిటీని విజయవాడలోనే ఉండమని చెప్పారు. అటు వాదనలు వినిపించేందుకు వచ్చిన చింతమనేని, వనజాక్షి కూడా వెనుదిరిగారు. దాంతో విజయవాడలోనే కమిటీ సభ్యుల ఎదుట వాదనలు వినిపిస్తారని పోలీసులు మీడియాకు చెప్పారు.

More Telugu News