Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేటి నుంచి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు... 21 రోజుల పాటు ఉత్సవాలు

వరసిద్ధి వినాయకుడిగా పూజలు అందుకుంటున్న కాణిపాకం గణనాధుడి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. దాదాపు 21 రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలకు కాణిపాకం ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. వినాయక చవితిని పురస్కరించుకుని నేటి నుంచి మొదలు కానున్న వినాయకుడి బ్రహ్మోత్సవాలకు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నట్లు అంచనా. వీటిలో భాగంగా నేడు వినాయక చవితి, గ్రామోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. వినాయకుడి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేటి తెల్లవారుజాము నుంచే గణనాధుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

More Telugu News