Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈపీఎఫ్ బీమా రూ.6 లక్షలకు పెంచాం: దత్తాత్రేయ

చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఇచ్చే ఈపీఎఫ్ బీమాను రూ.6 లక్షలకు పెంచినట్టు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. బీమా వర్తింపు నిబంధనలో సడలింపు చేశామని, ఒక్క రోజు పనిచేసినా ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్ డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ వర్తిస్తుందని చెప్పారు. హైదరాబాదులోని తాజ్ కృష్ణలో ఈరోజు జరిగిన ఈపీఎఫ్ కేంద్రీయ ధర్మకర్తల మండలి సమావేశంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసంఘటిత రంగ కార్మికులను సంఘటిత రంగంలోకి తీసుకువస్తున్నామని ప్రకటించారు. భవిష్యనిధి ఖాతాదారులకు సమాచారం కోసం ఈపీఎఫ్ మొబైల్ యాప్ ప్రవేశపెట్టామని దత్తాత్రేయ తెలిపారు. ఈపీఎఫ్ లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతులపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

More Telugu News