: మహేశ్ బాబుకు చంద్రబాబు అభినందనలు...బాబుకు మహేశ్ ధన్యవాదాలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ట్విట్టర్లో అభినందించారు. 'శ్రీమంతుడు' సినిమాను వీక్షించిన ఆయన, అందులోని 'సమాజానికి ఇవ్వాలి' అనే సందేశం ఆకట్టుకుందని బాబు తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన 'స్మార్ట్ విలేజ్-స్మార్ట్ వార్డ్' కార్యక్రమానికి ఈ సినిమా దగ్గరగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమా బాగుందని ఆయన ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మహేశ్ సినిమా చూసినందుకు ధన్యవాదాలు చెప్పాడు. చంద్రబాబు 'శ్రీమంతుడు' సినిమా చూడడం గర్వంగా భావిస్తున్నామని, ఆయన ప్రశంసలను తమకు దక్కిన గౌరవంగా బావిస్తున్నామని మహేశ్ ట్వీట్ చేశాడు.

More Telugu News