: ఇనుము దొంగతనం కేసులో తృణమూల్ ఎమ్మెల్యేకు రెండేళ్ల జైలు శిక్ష
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోహ్రబ్ అలీకి స్థానిక న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. బురద్వాన్ జిల్లాలోని రాణీగంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సోహ్రబ్ అలీ ఎన్నికయ్యారు. రైల్వేకు చెందిన ఇనుము దొంగతనం కేసులో ఆయనకు అసన్ సోల్ న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో సోహ్రబ్ అలీ తరపు న్యాయవాదులు మాట్లాడుతూ, ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేయనున్నామని తెలిపారు. దీనిపై స్పీకర్ బిమన్ బెనర్జీని అడగగా, శిక్షపై కోర్టు ఆర్డర్ ను పరిశీలించిన అనంతరం తాను స్పందించగలనని చెప్పారు.