: షీనా బోరా కేసులో తల్లికి జ్యుడీషియల్ కస్టడీ
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసు నిందితులకు నేటితో పోలీసు కస్టడీ ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో ముంబై కోర్టు షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, డ్రైవర్ శ్యామ్ రాయ్ లకు మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ వెంటనే వారిని జైలుకు తరలించారు. అయితే, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నాకు మాత్రం కోర్టు పోలీస్ కస్టడీ పొడిగించింది. దీంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని, తదుపరి విచారణ నిమిత్తం కోల్ కతాకు తీసుకువెళుతున్నారు.