: ఈ నెల 16 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మీడియాకు తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా రేపు ఉదయం ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో 11 గంటలకు శ్రీవారి దర్శనం నిలిపివేసి ఆలయాన్ని శుధ్ధి చేయనున్నట్టు చెప్పారు. తరువాత శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. అంతేగాక ఆలయంలో రేపు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్టు వివరించారు. మరోవైపు బ్రహ్మోత్సవాలకు గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబులను టీటీడీ ఇప్పటికే ఆహ్వానించింది.