: ప్రేమ సందేశానికి ఈ- మెయిలే బెస్ట్...!


ప్రేమ సందేశం పంపడానికి వాయిస్ మెయిల్, ఫోన్ కాల్ కంటే ఈ మెయిల్ బెస్టు అని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ సందేశం పంపేటప్పుడు వాయిస్ మెయిల్, ఫోన్ కాల్ లో కంటే ఈ మెయిల్ లోనే అద్భుతమైన భావవ్యక్తీకరణ ఉంటుందని అమెరికా నిపుణులు చెబుతున్నారు. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం సంబంధ అంశాలు వ్యక్తం చేసుకోవడానికి ఈ మెయిల్ మంచి ఎంపిక అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రేమ సందేశాలు మెయిల్ లో అయితే పాజిటివ్ గా, ఆకర్షణీయంగా రాస్తారని వారు తేల్చారు. అలాగే మంచి భాష, మంచి భావం, ఆకర్షణీయమైన విధానంలో వ్యక్తీకరిస్తున్నారని వారు చెప్పారు. ఫోన్ కాల్ లేదా వాయిస్ మెయిల్ ద్వారా వ్యక్తీకరించలేని వాటిని కూడా మెయిల్ లో అందంగా చెబుతున్నారని వారు తెలిపారు. ప్రేమ సందేశానికి మెయిలే అద్భుతమైనదని వారు తేల్చారు.

  • Loading...

More Telugu News