: దేవినేని ఉమ రాష్ట్రానికి పట్టిన దరిద్రం: పార్థసారధి
ఆంధ్రప్రదేశ్ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ రాష్ట్రానికి పట్టిన దరిద్రమని మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తెలుగు ప్రజల హక్కును ఢిల్లీలో తాకట్టుపెట్టిన టీడీపీ నేతలకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ ను విమర్శించే హక్కు లేదని అన్నారు. విషజ్వర బాధితులు, రాజధాని భూసేకరణ రైతులకు అండగా జగన్ దీక్ష చేపడితే దానిని విమర్శించడం సరికాదని ఆయన తెలిపారు. జోగి రమేష్ మాట్లాడుతూ, దేవినేని ఉమ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. మంత్రి పదవిలో ఉండి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు.