: తెలంగాణకు గుడ్ న్యూస్... రూ. 1257 కోట్లు వెనక్కి

తెలంగాణ ప్రభుత్వానికి సంతోషకర వార్త. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఐటీ శాఖ పన్ను రూపేణా రూ. 1257 కోట్లను కట్ చేసిన సంగతి తెలిసిందే. నేరుగా రిజర్వ్ బ్యాంక్ నుంచే ఈ మొత్తం కట్ అయింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెప్పింది. చివరకు హైకోర్టుకు కూడా వెళ్లింది. ప్రభుత్వ రంగ సంస్థల బకాయిలను ఈ విధంగా ప్రభుత్వ నిధుల నుంచి తీసుకోవడం సరికాదని వాదించింది. దీంతో, ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక, రెవెన్యూ శాఖల కార్యదర్శులు పరిశీలన జరిపారు. అనంతరం, రూ. 1257 కోట్లను తెలంగాణ ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని వీరు నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఫైల్ పై ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సంతకం చేయనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News