: రోజా ఒక ప్యాకేజీ ఎమ్మెల్యే... కులాల పేరుతో రాజకీయం చేయడం ఆమెకు అలవాటైపోయింది: టీడీపీ
రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాల్సింది పోయి... వైకాపా శవరాజకీయాలకు పాల్పడుతోందని టీడీపీ నాయకురాలు అనురాధ విమర్శించారు. వైయస్ చనిపోయిన సమయంలో కూడా తండ్రి శవాన్ని అడ్డుపెట్టుకుని సీఎం కావాలని జగన్ ప్రయత్నించారని ఆరోపించారు. పుష్కరాల తొక్కిసలాట, నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఆత్మహత్యలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని వైకాపా భావిస్తోందని మండిపడ్డారు. వైకాపా నాయకురాలు రోజా ఒక ప్యాకేజీ ఎమ్మెల్యే అని... కులాల పేరుతో రాజకీయం చేయడం ఆమెకు అలవాటైపోయిందని దుయ్యబట్టారు. రిషితేశ్వరి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు అన్ని విధాలా ఆదుకుంటున్నారని... నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.