: ఎయిర్ టెల్ 4జి సేవలు మొదలు; కనీస ధర రూ. 25 మాత్రమే

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 296 పట్టణాలు, నగరాల్లో 4జి సేవలను ఎయిర్ టెల్ ప్రారంభించింది. 3జి ధరల్లోనే 4జి తరంగాలను వాడుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కనీస మొత్తం రూ. 25 నుంచి 4జి డేటా ప్యాక్ లు ప్రారంభమవుతాయని తెలిపింది. 4జి స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని పెంచేందుకు శాంసంగ్ తో కలసి చేసుకున్న డీల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ లో హ్యాండ్ సెట్లను విక్రయించనున్నట్టు తెలిపింది. 4జి డేటా వాడకాన్ని ట్రాక్ చేసేందుకు 'ఫ్లెక్స్ పేజ్' పేరిట ఆటోమేటెడ్ ప్లాట్ ఫాంను కూడా విడుదల చేసినట్టు తెలిపింది. ఈ సేవలను పొందాలంటే, కస్టమర్లు 4జి సిమ్ ను తీసుకోవాల్సి వుంటుందని, అన్ని ఎయిర్ టెల్, శాంసంగ్ రిటైల్ స్టోర్లలో కస్టమర్లు తమ సిమ్ లను 4జిలోకి మార్చుకోవచ్చని తెలిపింది. రూ. 999తో అన్ లిమిటెడ్ 4జి డేటా, కాలింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపింది.

More Telugu News