: ఒబామా పాలనలో మంచి అవకాశాలు దక్కించుకుంటున్న భారత సంతతి వ్యక్తులు
బరాక్ ఒబామా హయాంలో భారత సంతతి వ్యక్తులకు సమున్నత గుర్తింపు లభిస్తోంది. అమెరికా దేశీయ వ్యవస్థలోని కీలక పదవుల్లో భారత మూలాలున్న వ్యక్తులనే ఒబామా నియమించడం అందుకు నిదర్శనం. అంతేగాదు, పలు దేశాల్లో భారత సంతతి వ్యక్తులే అమెరికా రాయబారులుగా నియమితులవుతున్నారు. ఈ క్రమంలో, తాజాగా శ్రీలంక రాయబారిగా భారత సంతతికి చెందిన అతుల్ కేశవ్ కు బాధ్యతలు అప్పగించారు. కేశవ్ గతంలో భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. కాగా, భారత సంతతి వ్యక్తి రిచర్డ్ రాహుల్ వర్మ గతంలో శ్రీలంకలో అమెరికా రాయబారిగా వ్యవహరించడం తెలిసిందే.