: జేసీ నివాసం ఎదుట ఏఐవైఎఫ్ ఆందోళన
దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన నేపథ్యంలో ఏపీలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. తాజాగా, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నివాసం ఎదుట ఏఐవైఎఫ్ ఆందోళన చేపట్టింది. ఈ సందర్భంగా చీర, పూలు, జాకెట్లతో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా సాధనలో తెలుగుదేశం పార్టీ చేతులెత్తేసిందని ఏఐవైఎఫ్ నేతలు పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని అన్నారు.