: కలాంకి నివాళులర్పించిన బాన్ కీ మూన్
మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం మృతిపట్ల ఐక్యారాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణానంతరం ప్రపంచవ్యాప్తంగా విచారం వ్యక్తమవడం కలాంకు దక్కిన గౌరవానికి నిదర్శనమన్నారు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు, తరువాత కూడా ఎంతోమందిలో ఆయన స్పూర్తి నింపారని పేర్కొన్నారు. భారత ప్రజలతో పాటు తాము కూడా ఆ గొప్ప రాజనీతిజ్ఞుడుకి నివాళులర్పిస్తున్నామన్నారు. ఆయన ఆత్మకు నిత్యం శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు తన సందేశంలో తెలిపారు. ఈ సందర్భంగా, న్యూయార్క్ లోని భారత పర్మినెంట్ మిషన్ ను ప్రత్యేకంగా సందర్శించి, అక్కడి సంతాప పుస్తకంలో కలాం గురించి పైవిధంగా రాశారు.