: అబ్దుల్ కలాంకు గూగుల్ నివాళి... ప్రత్యేక డూడుల్ విడుదల
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు సెర్చింజన్ గూగుల్ ఘన నివాళి అర్పించింది. ఈ మేరకు తన హోం పేజీలో డూడుల్ ను పొందుపరిచింది. డూడుల్ లో సెర్చ్ బాక్స్ కింద బ్లాక్ రిబ్బన్ ను ఏర్పాటు చేసిన గూగుల్, దాని కింద ‘‘ఇన్ ద మెమరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం’’ అనే వ్యాఖ్యను పొందుపరిచింది. బ్లాక్ రిబ్బన్ పై కర్సర్ ఉంచగానే ఈ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేసింది. మూడు రోజుల క్రితం ఏపీజే అబ్దుల్ కలాం మరణించిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో కలాం అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.