: పంజా విసిరింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులా?
పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసిన ఉగ్రవాదులు ఎస్పీ సహా ఏడుగురిని హతమార్చారు. పాక్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారని ఇప్పటి దాకా భావించారు. అయితే, ఈ దాడికి పాల్పడింది అత్యంత కిరాతకమైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులే అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉగ్రవాదులు పోలీస్ స్టేషన్ లోకి చొరబడే ముందు ఐఎస్ఐఎస్ అనుకూల నినాదాలు చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మరోవైపు, లష్కరే తాయిబా సహాయంతో భారత్ పై ఐఎస్ఐఎస్ దాడి చేసే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి.