: అసదుద్దీన్ ఒవైసీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన బీజేపీ
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దిష్టిబొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. హైదరాబాదులోని సైదాబాదులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముంబై పేలుళ్ల ఘటనలో ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న యాకుబ్ మెమెన్ కు అనుకూలంగా అసదుద్దీన్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ అతని దిష్టి బొమ్మను బీజేపీ కార్యకర్తలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా అసదుద్దీన్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.