: బొత్సను కలసిన పారిశుద్ధ్య కార్మికులు... తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి
ఏపీలో కొన్ని రోజుల నుంచి సమ్మె చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణను విజయనగరంలో కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని బొత్సకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమ్మెపై ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు అనుసరిస్తోందని అన్నారు. తప్పకుండా కార్మికుల తరపున పోరాడతామని హామీ ఇచ్చారు. ఇక రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాట ఘటనకు టీడీపీనే కారణమని ఆయన ఆరోపించారు. ఇలాంటి కుట్రపూరిత కార్యక్రమాలు చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని బొత్స వ్యాఖ్యానించారు.