: అశోక్ బాబుకు పరాభవం... కర్నూలులో అభినందన సభను అడ్డుకున్న విద్యార్థులు

ఏపీఎన్టీఓ అధ్యక్షుడు అశోక్ బాబుకు పరాభవం ఎదురైంది. కర్నూలులో అశోక్ బాబు అభినందన సభను విద్యార్థులు అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా వ్యవహరించారని ఆయనపై విద్యార్థులు తిరగబడ్డారు. వివరాల్లోకెళితే... కర్నూలు జిల్లాకు చెందిన ఏపీఎన్జీవో నేతలు అశోక్ బాబును ఘనంగా సన్మానించేందుకు ‘అభినందన సభ’ పేరిట భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అశోక్ బాబు నేటి ఉదయం కర్నూలు చేరుకున్నారు. అయితే అభినందన సభపై సమాచారం అందుకున్న విద్యార్ధులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. సభను అడ్డుకున్నారు. రాష్ట్ర విభజనకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించారని అశోక్ బాబును నిలదీశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More Telugu News