: టి.సచివాలయం ముట్టడికి యత్నించిన లోక్ సత్తా

తెలంగాణ సచివాలయాన్ని లోక్ సత్తా నేతలు, కార్యకర్తలు ముట్టడించే యత్నం చేశారు. లోక్ సత్తా తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు నేతృత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ ముట్టడి జరిగింది. సచివాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పాండురంగారావు మాట్లాడుతూ, కేసీఆర్ పాలన పూర్తయి ఏడాది అవుతున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి పుష్కరాల మీద ఉన్న ఆసక్తి నిరుద్యోగుల మీద లేదని మండిపడ్డారు.

More Telugu News