: ప్యాకేజీ కల్యాణ్...మాపై విమర్శలా?: జనసేన అధినేతపై ఎంపీ సుమన్ ఫైర్
నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోమవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల టీఆర్ఎస్ యువ ఎంపీ బాల్క సుమన్ ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ గతంలో ప్యాకేజీలు తీసుకుని మాట్లాడినట్టే ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయన 'ప్యాకేజీ కల్యాణ్' అని ఎద్దేవా చేశారు. అవినీతికి పాల్పడింది టీడీపీ నేతలైతే, తమపై విమర్శలు చేయడం ఏమిటని మండిపడ్డారు. చంద్రబాబును ఏ విషయంలోనూ ప్రశ్నించలేదని అన్నారు. అవినీతికి పాల్పడిన వారిని ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి, ఇప్పుడు అవినీతిపరులకు మద్దతిస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్ కల్యాణ్ కు చాలా విషయాల్లో అవగాహన లేదని అన్నారు.