: 'వ్యాపం' స్కాంపై 9 పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీం
మధ్యప్రదేశ్ లో సంచలనం సృష్టించిన 'వ్యాపం' కుంభకోణంపై సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 9 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటన్నింటినీ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారణకు స్వీకరించింది. ఈ స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ సహా ఇతరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నెల 9న వాటిపై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఇంతవరకు ఈ స్కాంలో 48 మంది అనుమానాస్పదస్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.