పచ్చినిజం... ఇండియాలో 35 లక్షల కుటుంబాల్లో పైసా సంపాదన కూడా లేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పచ్చినిజం... ఇండియాలో 35 లక్షల కుటుంబాల్లో పైసా సంపాదన కూడా లేదట!

80 సంవత్సరాల స్వతంత్ర భారతావని చరిత్రలో తొలిసారిగా విడుదలైన సామాజిక ఆర్థిక కుల గణన (ఎస్ఈసీసీ-సెక్) వివరాలు పలు కొత్త వివరాలు బయటపెడుతున్నాయి. ఇండియాలో ఏ విధమైన ఆదాయ వనరులూ లేని 35 లక్షల కుటుంబాలు ఉన్నాయని 'సెక్' రిపోర్టు వెల్లడిస్తోంది. అంతేకాదు, ఇండియాలోని 90 లక్షల గృహాల్లో మహిళలే కుటుంబ పెద్ద బాధ్యతలు పోషిస్తున్నారని, విద్యుత్, మంచినీరు, టాయిలెట్ తదితర కనీస సౌకర్యాలు లేని గృహాల సంఖ్య 6.51 కోట్లని తేల్చింది. లక్ష కుటుంబాల్లో కనీసం ఒక యాచకుడు ఉన్నాడని వివరించింది. ఫ్రిజ్, ల్యాండ్ లైన్ ఫోన్, వాషింగ్ మెషీన్, టూ వీలర్ లను కలిగివున్న కుటుంబాల సంఖ్య 86 లక్షలు కాగా, కోటికి పైగా కుటుంబాల్లో వీటిల్లో ఏదో ఒకటి ఉందని తెలిపింది.

More Telugu News