: మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో రూ.240 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.26,950కి చేరింది. అలాగే వెండి ధర రూ.300 పెరగడంతో కేజీ ధర రూ.36,700కి చేరింది. అటు జాతీయ మార్కెట్ లో 99.9 స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ.26,950 ఉంది. పుంజుకుంటున్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో ఈ రెండింటి ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.