: అక్కడ మహిళలకు రక్షణ లేదు... 5 నెలల్లో 51 అత్యాచారాలు!

అరాచకాల ఉత్తరప్రదేశ్ లో ఘజియాబాద్ జిల్లా రేపిస్టుల జిల్లాగా పేరుతెచ్చుకుంటోంది. ఈ జిల్లాలో యువతులు, మహిళలకు రక్షణ లేదంటే అతిశయోక్తి కాదు. దేశంలో అత్యధిక అత్యాచార ఘటనలు చోటుచేసుకునే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఘజియాబాద్ జిల్లా నెంబర్ వన్ గా నిలుస్తోంది. గడచిన 5 నెలల్లో 51 అత్యాచార ఘటనలు జరిగినట్టు కేసులు నమోదయ్యాయి. పరువు ప్రతిష్ఠలు, అసమానతల కారణంగా బయటకు చెప్పుకోలేని అత్యాచారాలు మరెన్ని జరిగాయో లెక్కలేదు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది మే 31 వరకు ఘజియాబాద్ జిల్లాలో 51 అత్యాచార కేసులు నమోదు కాగా, 208 వేధింపుల కేసులు నమోదయ్యాయట. ఇంత దారుణాలు చోటుచేసుకుంటున్నా, యూపీ పాలక పార్టీ పెద్దలు మాత్రం...పెద్ద రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు మామూలేనని వ్యాఖ్యానించడం విశేషం.

More Telugu News