: అబ్బాయిలకంత సీన్ లేదు...అమ్మాయిలే బెస్టు!


విద్యారంగంలో అమ్మాయిలు దూసుకుపోతున్నారని ప్రతి పరీక్ష ఫలితాల తరువాత రుజువవుతూనేఉంది. ఈ నేపథ్యంలో లెక్కలు చేయడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే బెస్టు అని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ సబ్జెక్టులను ఎంచుకోవడంలో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య వ్యత్యాసం పెద్దఎత్తున ఉంటోంది. దీంతో, వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన షేన్ బెంచ్ నేతృత్వంలోని పరిశోధకులు దీనికి కారణాలేంటి? అనే దానిపై పరిశోధనలు చేశారు. దీంతో, 122 మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 184 మంది ఇతర విద్యార్థుల్ని ఈ పరిశోధనకు తీసుకున్నారు. వీరిని రెండేసి గ్రూపులుగా విభజించి, వారి స్థాయిని అనుసరించి కొన్ని లెక్కలు ఇచ్చారు. అందులో అబ్బాయిలు ఎక్కువ లెక్కలు పరిష్కరిస్తామని చెప్పి, తక్కువ పరిష్కరించగా; అమ్మాయిలు మాత్రం తమకు ఎన్ని వచ్చో అన్నే పరిష్కరించి చూపించారు. దీంతో అబ్బాయిలు తమను తాము ఎక్కువగా అంచనా వేసుకుని, తక్కువ సామర్థ్యంతో పని చేస్తారని, అమ్మాయిలు తమ సామర్థ్యం తెలుసుకుని స్పష్టంగా మాట్లాడుతారని, అలాగే లెక్కల్లో అమ్మాయిలే బెస్టు అని పరిశోధన వెల్లడించింది.

  • Loading...

More Telugu News