: 'ప్లూటో, చరాన్' తొలి రంగుల చిత్రం వచ్చేసింది!


సౌర మండలంలోని ప్లూటో, దాని చుట్టూ తిరుగాడే అతిపెద్ద చందమామ 'చరాన్'ల కలర్ వీడియోను నాసా తొలిసారిగా విడుదల చేసింది. నాసా చేపట్టిన 'న్యూ హొరైజన్స్ మిషన్' ఈ 11 సెకన్ల చిత్రాన్ని తన కెమెరాల్లో బంధించింది. ప్లూటో, చరాన్ ల మధ్య కక్ష్య దూరాన్ని కూడా సరిగ్గా లెక్క కట్టింది. ఈ రెండింటి కదలికలను, అది కూడా రంగుల్లో చూడడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని న్యూ హొరైజన్స్ ముఖ్య పరిశోధకుడు అలెన్ స్టెరిన్ వ్యాఖ్యానించారు. ఈ చిత్రం తక్కువ రెజల్యూషన్లో ఉన్నప్పటికీ, ప్లూటో నారింజ రంగులో, చరాన్ బూడిద రంగులో కనిపిస్తోందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని న్యూ హొరైజన్స్ 12,500 కి.మీ. దూరం నుంచి తీసిందని తెలిపారు.

  • Loading...

More Telugu News