: కోర్టుకెక్కిన హీరో విశాల్... శరత్ కుమార్ తో అమీతుమీకి సిద్ధం

తమిళనాట నడిగర్ సంఘం ఎన్నికల వ్యవహారం కోర్టుకెక్కింది. ఎన్నికల తేదీని మార్చాలంటూ హీరో విశాల్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుత అధ్యక్షుడు శరత్ కుమార్ తో విశాల్ కు గత కొంతకాలంగా పొసగడంలేదు. తన నిర్ణయాలను విశాల్ ప్రశ్నిస్తుండడంపై శరత్ కుమార్ గుర్రుగా ఉన్నారట. విమర్శలు చేస్తే సంఘం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారట కూడా. తానేమీ తప్పు చేయలేదని, అవాస్తవ ప్రకటనలపై ప్రశ్నించానని విశాల్ అంటున్నారు. సంఘం నుంచి తొలగించినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారం ఎంతవరకు వెళుతుందో చూడాలి!

More Telugu News