: తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక

తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్.శ్రీనివాసన్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు చెన్నైలో జరిగిన టీఎన్ సీఏ 85వ వార్షిక కార్యవర్గ సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. దాంతో శ్రీని సొంత రాష్ట్రంలోనూ హవా చాటారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఐసీసీ చైర్మన్ గా, గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీని తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం. ఆయనతో పాటు టీఎన్ సీఏ కార్యదర్శిగా కాశీ విశ్వనాథన్ కూడా పదవిని దక్కించుకున్నారు. వీపీ నరసింహన్ కోశాధికారిగా ఎన్నికయ్యారు.

More Telugu News