: కాంగ్రెస్ కు బొత్స ద్రోహం చేశారు: రఘువీరారెడ్డి
ఇన్నాళ్లు పార్టీలో పదవులనుభవించి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి బొత్స తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో ఆయన తప్పు చేస్తున్నారని హెచ్చరించారు. అయితే ఒకరిద్దరు పార్టీ వీడినా కాంగ్రెస్ కు వచ్చిన నష్టం లేదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించేది లేదన్న రఘువీరా, అందుకే బొత్సను సస్పెండ్ చేశామని పేర్కొన్నారు.