: మాగంటి, ప్రకాశ్ గౌడ్ లను కలవడానికి ఇష్టపడని రేవంత్ రెడ్డి
నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభపెట్టాడంటూ ఏసీబీ అరెస్టు చేసిన టీడీపీ నేత రేవంత్ రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయనను చంచల్ గూడ నుంచి చర్లపల్లి జైలుకు తరలించడం తెలిసిందే. రేవంత్ కు రిమాండ్ విధించినప్పటి నుంచి ఆయనను టీడీపీ ఎమ్మెల్యేలు జైలుకెళ్లి పరామర్శిస్తున్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతమని తేడా లేకుండా, పార్టీ నేతలందరూ రేవంత్ కు సంఘీభావం ప్రకటించారు. అయితే, బుధవారం తనను కలిసేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, ప్రకాశ్ గౌడ్ లతో మాట్లాడేందుకు రేవంత్ విముఖత ప్రదర్శించారట. దాంతో, ఆ టీడీపీ ఎమ్మెల్యేలిద్దరూ నిరాశతో వెనుదిరిగారు.