: కోర్టుకు రేవంత్ వీడియో ఫుటేజ్ సమర్పించిన ఏసీబీ
'నోటుకు ఓటు' వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో ఫుటేజ్ ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు. వెంటనే ఆ వీడియో టేపులను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపాలని కోర్టు ఆదేశించింది. అంతేగాక రేవంత్ ఆడియో, వీడియో టేపులపై నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశాలు ఇచ్చింది.