: రేవంత్ రెడ్డిని ట్రాప్ చేయాలని స్టీఫెన్ సన్ ను బెదిరించారు: ఏ4 నిందితుడు మత్తయ్య ఆక్రోశం
రేవంత్ రెడ్డి కేసులో ఏ4 నిందితుడు మాథ్యూ జెరూసలేం అలియాస్ మత్తయ్య తెలంగాణ సర్కారుపై విరుచుకుపడ్డారు. దళితుడైనందునే స్టీఫెన్ సన్ ను ఈ వ్యవహారంలో పావులా వాడుకున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డిని ట్రాప్ చేసేందుకు సహకరించాలంటూ స్టీఫెన్ సన్ ను బెదిరించారని ఆరోపించారు. ఇది కచ్చితంగా తెలంగాణ సర్కారు కుట్రేనని అన్నారు.
ఇక, తాను పరారీలో ఉన్నట్టు వచ్చిన వార్తలపైనా ఆయన స్పందించారు. తాను అజ్ఞాతంలో లేనని స్పష్టం చేశారు. తన ఫోన్ నెంబర్ ఏసీబీ అధికారులకు తెలుసని, అవసరమైతే ఫోన్ చేయొచ్చు కదా? అని అన్నారు. ఈ వ్యవహారంలో తానెలాంటి మధ్యవర్తిత్వం నడపలేదని తెలిపారు. కేసీఆర్ దళిత, క్రైస్తవ వ్యతిరేకి అని విమర్శించారు.