: చంద్రబాబును అరెస్ట్ చేయాలంటూ వైకాపా డిమాండ్... జాతీయ రహదారిపై ధర్నా

రూ. 50 లక్షల ముడుపుల వ్యవహారంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి డబ్బు ఇచ్చింది ఏపీ సీఎం చంద్రబాబేనని వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. తక్షణమే చంద్రబాబును కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఆయన ధర్నా కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ, నీతి, నిజాయతీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. మహానాడులో చంద్రబాబు చెప్పిన నీతి కబుర్లన్నీ బూటకమని రేవంత్ ఉదంతంతో తేలిపోయిందని అన్నారు.

More Telugu News