: ఎమ్మెల్సీ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్న టీఆర్ఎస్

శాసనమండలికి రేపు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, టీఆర్ఎస్ పార్టీ కాసేపట్లో తమ ఎమ్మెల్యేలకు మాక్ పోలింగ్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు, ఎమ్మెల్యేలంతా హాజరవుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలన్న విషయంపై వారికి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. రేపు ఉదయం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటిలో నాలుగు స్థానాలను గెలుచుకునే మెజర్టీ టీఆర్ఎస్ కి ఉన్నప్పటికీ... ఐదో స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో టీఆర్ఎస్ ఉంది.

More Telugu News