: మరణానికి ముందు ముంబైకి చెందిన వ్యక్తితో ఫోన్లో మాట్లాడిన సౌజన్య

పెళ్లయిన కొన్ని రోజులకే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సౌజన్య విజయవాడలోని అపార్టుమెంటుపై నుంచి కిందకు పడి మృతి చెందిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచనలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ప్రమాదవశాత్తు కిందకు పడిందా? అనే విషయంలో ఎన్నో అనుమానాలున్నాయి. ఈ క్రమంలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. మరణానికి ముందు ఆమె ముంబైకి చెందిన ఓ వ్యక్తితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఈ నేపథ్యంలో, సౌజన్య ఆత్మహత్యకే పాల్పడి ఉండవచ్చని వీరు అనుమానిస్తున్నారు. తమకు లభించిన ఆధారాలతో కేసును త్వరగా ఛేదిస్తామని పోలీసులు చెబుతున్నారు. సౌజన్య భర్త కూడా సాఫ్ట్ వేర్ ఇంజినీరుగానే పనిచేస్తున్నాడు. ఇద్దరూ హైదరాబాదులోనే కాపురం పెట్టారు.

More Telugu News